Varun Tej:మట్కా టీజర్‌ డేట్ లాక్

5
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైలీ యాంటిసిపేటెడ్ పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ . కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ‘మట్కా’ వరుణ్ తేజ్‌కి మోస్ట్ హై బడ్జెట్ మూవీ.నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది ఈ సినిమా.

1958, 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారు. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ అవతార్స్ లో అద్భుతంగా చూపిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ లో వరుణ్ తేజ్ వైవిధ్యమైన లుక్స్ అదరగొట్టాయి.

వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

Also Read:Samantha: నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత

ఈ మూవీ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. విజయవాడ రాజ్ యువరాజ్‌ సెంటర్‌లోని జీ3 థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేస్తున్నట్టు తెలియజేశారు. వరుణ్ తేజ్ సోఫాపై కూర్చొని స్టైలిష్‌గా సిగరెట్‌ తాగుతున్న లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -