ఆ హీరోయిన్‌తో మెగా హీరోకు ఎఫైర్‌….!

287
Varun Tej affair Pragya Jaiswal
- Advertisement -

టాలీవుడ్‌లో మెగా హీరోల హావా కొనసాగుతుంది. మొన్నటి వరకు అల్లు అర్జున్‌, రాంచరణ్‌తేజ్‌లు ఇప్పుడు అల్లుశిరీష్‌, సాయిధర్మమ్‌ తేజ్, వరణ్‌తేజ్‌ ఇలా వరస పెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు మెగా హీరోలు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మెగాహీరోల దూకుడికి హీరోయిన్స్ కొరత వచ్చిందట. మెగాహీరోలు వరుస పెట్టి సినిమాలు తీస్తుంటే…హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవటం అనేది వీరికి పెద్ద సమస్యగా మారిపోయిందట. ఈ విషయం ఇలా ఉంటే ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాహీరోలు అందరూ హీరోయిన్స్‌ విషయంలో కాస్త అంటీ ముంటనట్టుగానే వ్యవహారిస్తారట.

Varun Tej affair Pragya Jaiswal

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్‌ ప్రకారం మెగాహీరోలు హీరోయిన్లతో చిలిపి వేషాలు వేసిన సందర్భాలు కూడ ఉన్నాయట. ఈ విషయం లో ప్రస్తుతం వరుణ్ తేజ్ పేరు ఫిల్మ్‌నగర్‌లో బాగానే వినిపిస్తుంది. నాగబాబు కుమారుడిగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ యువ హీరో…ముకుంద, కంచె చిత్రాలతో తిరుగు లేని హీరోగా తనదైన ముద్ర వేసుకుని ప్రేక్షకులను బాగానే మెప్పించాడు.

Varun Tej affair Pragya Jaiswal

అయితే తాజాగా వరణ్‌తేజ్‌కు ఓ హీరోయిన్‌తో ఎఫైర్‌ ఉందని అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లో ఏ హీరో,హీరోయిన్‌పైన నైన ఇలాంటి రూమార్స్‌ రావడం సహాజం కానీ ఫిల్మ్ నగర్ లో మాత్రం వరుణ్ తేజ్ వ్యవహారంపై కొంత హాట్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఆ హీరోయిన్ కి సంబంధించిన విషయంలో ఇద్దరు పేర్లు బయటకు వినిపిస్తున్నప్పటికీ…ముఖ్యంగా ప్ర‌గ్యా జైస్వాల్ పేరు బయటకు వస్తుంది. వీరిద్దరూ గతంలో కంచె సినిమాలో నటించారు. ఆ తరువాత నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Varun Tej affair Pragya Jaiswal

అయితే ఇది విన్న సినీ పండితులు మాత్రం వరణ్‌తేజ్‌కి అంతసీన్‌ లేదని కొట్టి పారేస్తున్నారు. వరణ్‌తేజ్‌ చాలా మంచివాడని… వరణ్‌పై వచ్చిన ఈ రూమార్స్‌ నమ్మరాదని , టాలీవుడ్‌లో ఎదుగుతున్న కొద్ది ఇలాంటి రూమార్స్‌ సృష్టించడం కామన్ అని తేల్చిచెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఇక కంచె సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న వరణ్‌ తేజ్‌ ఈఏడాది మిస్టర్‌,ఫిదా వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

- Advertisement -