వరుణ్ సెకండ్ ఇన్నింగ్స్‌..నింద!

15
- Advertisement -

హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశాడు. నింద మూవీతో అలరించేందుకు వస్తున్నాడు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం ఈ సినిమాని నిర్మించడమే కాదు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవాళ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని లుక్‌ని రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్ అమయాకంగా ఉంటే వెనుక ఓ ముసుగు వ్యక్తి రూపం ఉంది. అలాగే ఈ పోస్టర్‌ను రివర్స్ చేస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మే 15న టీజర్‌ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.

Also Read:వెన్నెల కిశోర్..OMG టీజర్

- Advertisement -