వ్యక్తుల కథలనూ, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ శైలే వేరు. తనదైన మార్క్‌ను జోడించి…ఫ్రీ పబ్లిసిటీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్థ్యం ఆర్జీవీది.
అయితే, కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్నవర్మ…. తెలుగులో ఇదే నా చివరి సినిమా అంటూ భారీ అంచనాల మధ్య వంగవీటి సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే .
అయితే ‘వంగవీటి’లో ఓ హీరో అయిన దేవినేని నెహ్రూ మరణంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ ఉదయం 10:20 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, “నెహ్రూ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో నేను గడిపిన అద్భుత సమయాన్ని గుర్తు చేసుకుంటున్నా.
బలమైన నేరారోపణలతో కూడిన శక్తికి ఆయన చిహ్నం” అని అన్నారు. కాగా వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న దేవినేని నెహ్రూ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.