తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తోపాటు ఆ శాఖకు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ నటులను సిట్ విచారిస్తున్న తీరు సరిగాలేదంటూ ఎక్సైజ్ శాఖపై తాను చేసిన కామెంట్లు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని చెప్తూనే అకున్ కు సారీ చెప్పేశాడు వర్మ.
అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిగా మీడియా చిత్రీకరిస్తుందని, అకున్‌ను హీరోగా పెట్టి దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 సినిమా తీయాలని ఫేస్‌బుక్‌లో రామ్‌గోపాల్ వర్మ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పూరీ జగన్నాథ్, సుబ్బరాజును 12 గంటల పాటు విచారించినట్లే డ్రగ్స్ తీసుకున్న పాఠశాల పిల్లలను కూడా విచారిస్తారా? అని వర్మ ఎక్సైజ్ శాఖ అధికారుల్ని ప్రశ్నించారు. ఎక్సైజ్‌శాఖ సినీ పరిశ్రమను టీజర్, ట్రైలర్‌లా వాడుకుని ఉనికి చాటుకుంటోందన్నారు. డ్రగ్స్ కేసులో నిజం ఏదైనప్పటికీ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
దీనిపై రియాక్ట్ అయిన ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఆర్.చంద్రవదన్ డ్రగ్స్ గుట్టు బయటపెట్టడానికి తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులను కించపరుస్తున్నారని అన్నారు. ఇక క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ స్పందిస్తూ పోలీసు శాఖ పనితనాన్ని తాను చిన్నబుచ్చలేదని, కేవలం సినిమా పరిశ్రమ, సెలబ్రిటీలను కొంచెం గౌరవించండి అని మాత్రమే తెలియజేయాలనుకున్నానని అన్నారు.