శ్రీరెడ్డితో ఆర్జీవీ మూవీ..!

229
Varma Ready To Direct Sri Reddy
- Advertisement -

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ పేరుతో ప్రకంపనలు సృష్టించింది నటి శ్రీరెడ్డి. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకుండా, కమిట్ మెంట్ , కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు ఇస్తున్నారని,మరికొందరైతే వాడుకుని పక్కన పడేస్తున్నారని కొంతకాలంగా ఆమె చేస్తున్న పోరాటంలో ఉహించని ట్విస్ట్ నెలకొన్న సంగతి తెలిసిందే. పవర్‌పై శ్రీరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఈ సీన్‌లోకి వర్మ ఎంట్రీతో అసలు ఇష్యూ పక్కకు జరిగి శ్రీరెడ్డి పోరాటంలో పాలిటిక్స్‌ చేరాయి. తన వెనుక జరుగుతున్న కుట్రకు వ్యతిరేకంగా పవన్‌ లీగల్‌ పోరాటానికి సిద్ధం అయ్యారు. మరోవైపు శ్రీరెడ్డి,వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. పవన్‌ వ్యతిరేక పోస్టులతో మరింత హిట్ రాజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ మరో ముందడుగు వేశారు. శ్రీరెడ్డితో త్వరలో సినిమా చేస్తానని ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవీ తగిన పాత్ర ఉంటే తన సినిమాల్లో శ్రీరెడ్డికి తప్పకుంటా అవకాశం ఇస్తానని ప్రకటించాడు.

మరోవైపు ఆర్జీవీకి వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చింది.  ఫిల్మ్‌ ఛాంబర్‌లో మా ప్రతినిధులతో పాటు లాయర్లతో పవన్ మంతనాలు జరిపారు. సుదీర్ఘ న్యాయపోరాటానికి తాను సిద్ధం అంటూ ప్రకటించారు. అంతేగాక చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీలోని టాప్ హీరోలంతా భేటీ అయి ఆర్జీవీకి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్’ సినిమా విడుదలను అడ్డుకోనేందుకు పవన్ అభిమానులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఇచ్చిన స్టేట్ మెంట్‌ అగ్నికి ఆజ్యం పోసేవిధంగా మారింది.

- Advertisement -