టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ అంశంపై ఎట్టకేలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ లేటైనా తనదైన శైలీలో స్పందించారు. హైదరాబాద్‌ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అకున్ సబర్వాల్ తీవ్రంగ శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ…ఆయనను టార్గెట్ చేశారు.డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, సుబ్బరాజును విచారించినట్లు.. సిట్ నోటీసులు అందుకున్న స్కూలు పిల్లలను కూడా 12 గంటల పాటు విచారిస్తారా? కేవలం విచారణేనా? అంటూ వర్మ ఎద్దేవా చేశారు.
అంతేగాదు మీడియాపై అక్కసు వెల్లగక్కాడు వర్మ. తెలుగు మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. డ్రగ్స్ పై దర్యాప్తు చేస్తున్న అకున్ సబర్వాల్ ను తెలుగు మీడియా ‘బాహుబలి’లోని ‘అమరేంద్ర బాహుబలి’ లెవెల్ లో పొగిడేస్తోందని అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై రాజమౌళి ‘బాహుబలి 3’ సినిమా తియ్యాలేమో అని ఎద్దేవా చేశాడు.
ఎక్సైజ్‌శాఖ ఎప్పటి నుంచో ఉందని, సినిమా వాళ్ల పేర్లు బయటపెట్టడం వల్లే ఆ శాఖ పేరు మొదటిసారి మార్మోగిపోతోందని, తమ పనితనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సినీ రంగాన్ని టీజర్, ట్రైలర్‌లా ఎక్సైజ్‌శాఖ వాడుకుందని వర్మ వ్యాఖ్యానించారు.