అర్జున్‌ రెడ్డిని వదలని వర్మ…!

210
Varma praises Vijay again
- Advertisement -

రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. వర్మ ఏది చేసినా అది సంచలనమే. తాజాగా అర్జున్ రెడ్డి సినిమా విడుదల దగ్గరి నుంచి విజయ్‌పై ప్రశంసలు గుప్పిస్తున్న  వర్మ …కాంగ్రెస్‌ నేత వీహెచ్‌, పవర్‌ స్టార్‌పై కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో విజయ్ నటన అమితాబ్‌ని తలపించిందని ట్వీట్ చేసిన ఆర్జీవీ పవన్ కంటే  20 రేట్లు నయమని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

ఇక అర్జున్ రెడ్డిని రెండోసారి చూసిన  వర్మ ఏకంగా బాలీవుడ్ నటుడితో పోల్చాడు.  అర్జున్‌రెడ్డి సినిమా మళ్లీ చూశాను. మన టాలీవుడ్‌ ఇండస్ట్రీకి విజయ్‌…లియోనార్డో డికాప్రియో అనడంలో సందేహంలేదు. ఇతని స్టార్‌డమ్‌ని, టాలెంట్‌ని బాగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఇతర నటుల్లా ఒకే తరహా సినిమాలు తీస్తున్నట్లు విజయ్‌ ఉండకూడదని కోరుకుంటున్నా.నిజానికి అతను ఒకే తరహా సినిమా కాకుండా కాస్త విభిన్న కథను ఎంచుకోవడం వల్లే సూపర్‌స్టార్‌ అయ్యాడు’ అని పోస్ట్‌ చేశారు వర్మ.

మరోవైపు అర్జున్ రెడ్డి సినిమాపై రోజుకో వివాదం చెలరేగుతున్నా కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హఫ్ సెంచరీ మార్క్ కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది.

- Advertisement -