వర్మకి షాక్‌…జీఎస్టీ అవుట్..!

335
varma GST out from youtube
- Advertisement -

వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’కి పుల్‌స్టాప్‌ పడింది. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ ట్రైలర్‌ ను యూట్యూబ్‌ అధికారికంగా తొలగించింది. జీఎస్టీ టైటిల్‌, ఆర్ట్‌ వర్క్‌ తనదేనంటూ యూట్యూబ్‌కు గత నెలలో సినీ రచయిత జయకుమార్ ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో జైకుమార్‌ ఫిర్యాదుతో యూట్యూబ్‌ నుంచి జీఎస్టీ ట్రైలర్‌‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే జ‌య‌కుమార్ త‌న ఆఫీసులో దొంగ‌త‌నం చేస్తూ ప‌లు మార్లు ప‌ట్టుబ‌డ్డాడని వ‌ర్మ అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

   varma GST out from youtube

ఇక వ‌ర్మ తీసిన ఈ షార్ట్ ఫిలిం ప‌లు వివాదాలు సృష్టించింది. మ‌హిళా లోకం దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జీఎస్టీ వెబ్‌ సిరీస్‌ వివాదంపై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవలే విచారించి , త్వ‌ర‌లో మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

కాగా..రాంగోపాల్ వర్మ మహిళలపై అభ్యంతరకర కామెంట్స్ చేశారని ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా…ప్ర‌స్తుతం వ‌ర్మ .. నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో కాప్ డ్రామా తెర‌కెక్కిస్తున్న విష‌యం విదిత‌మే.

- Advertisement -