వాటే క్రియేటివిటీ..వెరైటీ వెడ్డింగ్ కార్డు!

53
- Advertisement -

మన దేశంలో వివాహ వేడుకలకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వెడ్డింగ్ కార్డుల ఎంపిక దగ్గరి నుంచి రిసెప్షన్ పూర్తయ్యే వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటాలని భావిస్తుంటారు. ఇక ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన దగ్గరి నుండి రకరకాల వెడ్డింగ్‌ కార్డులు వైరల్‌గా మారాయి.

ఇక ఇప్పటివరకు మనం రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అసోంలోని గౌహతికి చెందిన ఒకన్యాయవాది తన వృత్తి నేపథ్యాన్ని వెడ్డింగ్ కార్డులో పొందుపరిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

తాజాగా ఖర్చీఫ్‌ పై వెడ్డింగ్ కార్డును ముద్రించి అందరిని ఆలోచింప చేస్తున్నారు. ఖర్చీఫ్ పెళ్లి పత్రికను ముద్రించారు. రెండు సార్లు ఉతికితే దానిపై ఉండే ప్రింట్ పోతుంది. ప్రకృతికి దోహదం చేసే ఈ ఆలోచనకు మంచి స్పందన వస్తోంది. ఎక్కడ పడితే అక్కడ పెళ్లి పత్రికలను పడేయడం,అందులోని దేవతల చిత్రాలు డస్ట్ బిన్‌లోకి వెళ్లాయనే బాధపడటం ఉండదు. అయితే వెడ్డింగ్ కార్డు మాత్రం అందరిని ఆకట్టుకుంటోంది. ఆకట్టుకునే డిజైన్ బాజా బజంత్రీలు,డోలు వాయిద్యాలు వంటివి చిత్రీకరించారు. దీనిపై నెటిజన్లు సైతం పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -