వారసుడు ఓటీటీలోకి ఎప్పుడంటే…

48
vijay
- Advertisement -

తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళం తెలుగు భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదల అయిన మూడు రోజుల తర్వాత తెలుగులో విడుదలైంది. తమిళంలో భారీ విజయంను నమోదు చేసుకున్న వారసుడు తెలుగులో మాత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సంపాదించుకుంది.

తెలుగులో వాల్తేరు వీరయ్య వీరసింహరెడ్డి సినిమాల ముందు సినిమా అంతగా హిట్‌ కాలేకపోయిందని టాలీవుడ్‌లో టాక్. రెండు భారీ తెలుగు సినిమాల ముందు ఈ తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించగా శరత్‌కుమార్‌ జయసుధ శ్రీకాంత్‌ శ్యామ్‌ ప్రభు సంఘవి తదితరులు కీలకపాత్రలో నటించారు. మొత్తమీద తమిళ తెలుగు నటులు కలిసి చేసిన సినిమాగా రూపొందించారు.

ఇక ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో ఫిబ్రవరి 10నుండి ఈ సినిమాను ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమా ఇప్పటివరకు రూ.200కోట్లకు పైగా గ్రాస్‌ సంపాదంచుకోవడమే కారణమని తెలుస్తోంది. విజయ్‌ నటించిన ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా..వాటిని పూర్తి స్థాయిలో నేరవేర్చలేకపోయాడు వంశీపైడిపల్లి. దీంతో అమెజాన్‌ సంస్థ స్ట్రీమింగ్‌ డీల్‌ను ప్రీపోన్‌ చేస్తున్నారని టాక్. మరీ మేకర్స్ నుండి ఆఫీషియల్‌గా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి…

తన ప్రేమ పుకార్ల పై రష్మిక స్పందన

‘ఆర్ఆర్ఆర్ సీక్వెల్’ పై కసరత్తులు

జబర్దస్త్ షో కొత్త ముచ్చట్లు!

- Advertisement -