విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన వారిసు తమిళ లో జనవరి 11 న పొంగల్ సందర్భంగా గ్రాండ్ గా రిలీజవుతుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా అదే డేట్ కి రిలీజ్ చేయాలని కొన్ని థియేటర్స్ బ్లాక్ చేసుకొని పెట్టుకున్నారు దిల్ రాజు. కానీ సంక్రాంతి తెలుగులో చిరంజీవి , బాలయ్య సినిమాలు రిలీజ్ ఉన్నందున్న వారిసు తెలుగు వర్షం ని జనవరి 14 న వాయిదా వేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ దిల్ రాజు ‘వారసుడు’ కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఇదే వేదికపై దిల్ రాజు ఓ అనుకోని ప్రశ్న ఎదురైంది. సహజంగా హైదరాబాద్ లో తమిళ్ , కన్నడ , మలయాళ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మరి వారిసు తమిళ వెర్షన్ ను తెలుగులో జనవరి 11 న రిలీజ్ అవుతుందా ? అనే ప్రశ్న వేశారు మీడియా.
అయితే దానికి దిల్ రాజు ఇంకా డిసిషన్ తీసుకోలేదని , తమిళ్ వర్షన్ గురించి ఆలోచిస్తామని తెలిపాడు. మామూలుగా అయితే వరిసు తమిళ వెర్షన్ ఇక్కడ రిలీజ్ అవ్వాలి. కానీ తెలుగులో రెండ్రోజుల ఆలస్యంగా వస్తున్న కారణం చేత దిల్ రాజు ఇప్పుడు తమిళ వెర్షన్ ని రిలీజ్ చేయడం కష్టమే అనిపిసస్తుంది. మరో రెండ్రోజుల్లో వారిసు తమిళ వెర్షన్ తెలుగు స్టేట్ లో రిలీజ్ పై క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి…