దర్శకుడు రాజమౌళి – మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్అయిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి…ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ అప్ డేట్ ఇచ్చారు. 2026 సెప్టెంబర్ నుంచి ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాజమౌళి సినిమాలకు కీరవాణి అందించే సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కాబట్టి, ఈసారి కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రియాంక చొప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్, మాధవన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 7న విడుదల కానుంది. పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్ కోసం చిత్రీకరించిన తొలి తెలుగు సినిమాగా నిలవనుందని సమాచారం.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

