వారంలో ఇళ్ల పట్టాల పంపిణీ…

76
- Advertisement -

తెలంగాణలో ఇళ్లు లేని కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం పేదలకు ఇండ్ల పంపిణీ, ఇళ్ల క్రమబద్దీకరణ, స్థలాల పంపిణీపై చర్చించారు. అనంతరం ఆధికారులకు దిశా నిర్దేశం చేస్తూ వారం రోజులోగా పట్టాల పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ హరీశ్‌రావు ఎర్రబెల్లి దయాకర్‌ రావు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు..

Also Read: కలల సౌధం..తెలంగాణ సచివాలయం

దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యంకు అనుగుణంగా పనిచేయాలిని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేయాలని ఉపసంఘం అధికారులకు స్పష్టం చేసింది. కలెక్టర్లు రోజువారి సమీక్ష నిర్వహించి పట్టాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూడాలన్నారు. జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి వాటి జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్‌ఏను ఆదేశాలు జారీ చేశారు.

Also Read: కర్ణాటకలో మాటల వార్..!

- Advertisement -