తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కు డేరింగ్ నటిగా పేరుంది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి శరత్ కుమార్ రాణిస్తోంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకత. సర్కార్ చిత్రంలో పోషించిన విలన్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఏ విషయంపైనైనా భయపడకుండా చెప్పే వరలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌పై మనసుపడింది.తాను ఎవరికైనా ప్రపోజ్ చేయాల్సి వస్తే ప్రభాస్‌కేనని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఈ బ్యూటీ ‘ఐ లవ్యూ’ అని చెప్పేసింది.
యాక్టింగ్ కెరీర్‌ను పక్కన పెడితే నా అడుగులు రాజకీయాల వైపే పడుతాయని చెప్పింది. తనకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. సమస్యలపై స్పందించే గుణం ఉందని అందుకే ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తానని తెలిపింది.
విశాల్‌తో వరలక్ష్మీ లవ్‌లో ఉందంటూ గతంలో వార్తలు హల్ చల్ చేయగా అవన్నీ పుకార్లేనని తెలిపోయాయి. తన పెళ్లి ప్రకటనతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు విశాల్.