తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

30
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇవాళ వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు.

వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేశారు. అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీతో పాటు భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.

వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.

Also Read:బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమా చార్యులు

- Advertisement -