బాహుబలి రికార్డ్స్ బ్రేక్.. రేటు పెంచింది

27
- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన ‘హను-మాన్’ బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా దూసుకెళ్తుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే రూ.120 కోట్ల క్లబ్ లో చేరింది.దీంతో టాలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ గోల్డెన్ లెగ్‌గా మారింది. క్రాక్, నాంది, వీర సింహారెడ్డి తో పాటు తాజాగా హనుమాన్ మూవీతో వరలక్ష్మి శరత్ కుమార్ మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసింది. దీంతో ఇప్పటివరకు సినిమాకు రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ,.. హనుమాన్ సక్సెస్ తో రూ.కోటి డిమాండ్ చేస్తుందని వినికిడి. నిజంగా వరలక్ష్మి శరత్ కుమార్ అంత డిమాండ్ చేస్తే.. కచ్చితంగా ఆమెకు సినిమాలు తగ్గే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే మరోవైపు శ్రియా రెడ్డి రూపంలో వరలక్ష్మి శరత్ కుమార్ కి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఇలా భారీ మొత్తంలో పారితోషకం పెంచితే ఎలా ? అనేది ఆమెనే ఆలోచించుకోవాలి. ఇదిలా ఉంటే.. హనుమాన్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అంతేకాదు ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. నార్త్‌ అమెరికాలో నాలుగు రోజుల్లోనే 3 మిలియన్ల డాలర్లకుపైగా వసూళ్లను సాధించిన తెలుగు సినిమాల జాబితాలో టాప్‌ 10లో నిలిచింది.

దీంతో ‘సలార్​’, ‘బాహుబలి’ పేరిట ఉన్న మొదటి వీకెండ్‌ బాక్సాఫీస్​ కలెక్షన్స్​ రికార్డులను బ్రేక్​ చేసింది. మొత్తానికి ‘సలార్​’, ‘బాహుబలి’ రికార్డ్స్​ ను ఒక చిన్న సినిమా అయిన హనుమాన్ బ్రేక్ చేయడం నిజంగా విశేషమే. స్టార్ హీరోలు సైతం ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ పై ఇప్పుడు ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలాగైనా ప్రశాంత్ వర్మ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకోవాలి అని కొందరు హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలయ్య బాబు ఆల్ రెడీ ప్రశాంత్ వర్మని లైన్ లో పెట్టినట్లు టాక్.

Also Read:కాలీఫ్లవర్.. వీళ్ళు తింటే ప్రమాదమే?

- Advertisement -