లలిత్ మోదీకి షాకిచ్చిన వనౌటు

11
- Advertisement -

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి షాకిచ్చింది వనౌటు. ఇటీవలె లలిత్ మోదీకి ఫసిఫిక్‌ ద్వీప దేశమైన వనౌటు పౌరసత్వం తీసుకున్నట్లు వార్తలు రాగా లలిత్‌ మోదీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో లిత్ పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను వనౌటు ప్రధాని జోథం నపాట్‌ ఆదేశించారు. భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకోవడానికి తమ దేశ పౌరసత్వాన్ని లలిత్ మోదీ ఉపయోగించుకుంటున్నట్టు నపట్ ఆరోపించారు.

లలిత్‌ మోదీ పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్‌లో కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు రాగా దేశం విడిచిపారిపోయిన లలిత్… లండన్‌కు మకాం మార్చారు. లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో పాస్‌పోర్టును అప్పగిస్తానని చెబుతూనే వనౌటు ‘గెల్డెన్‌ పాస్‌పోర్ట్‌’ కార్యక్రమం కింద పౌరసత్వం పొందినట్లు తెలిసింది. దీంతో ఆయనకు షాకిచ్చింది వనౌటు.

Also Read:చేనేత కార్మికులకు శుభవార్త

- Advertisement -