- Advertisement -
డైలీ సీరియల్స్ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు వంటలక్క. కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్కగా… దీపగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో తన అద్భుత నటనతో అశేష ప్రేక్షకులను సంపాదించుకుంది. మూడున్నరేళ్లుగా అంటే దాదాపు 1082 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుందంటే ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా కొత్త సీరియల్‌తో రాబోతుంది వంటలక్క. అయితే అది తెలుగులో కాదు మలయాళ సీరియల్‌లో. జూలై 5 నుంచి సూర్య టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న సీరియల్‌లో దేవికగా అలరించనుంది. ఈ ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది వంటలక్క.
- Advertisement -

