వాణీజయరాం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

65
- Advertisement -

ప్రముఖ గాయని వాణీజయరామ్(78) మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వాణీజయరామ్. ఈ క్రమంలో ఈ రోజు చైన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె ఇప్పటి వరకూ 10 వేలకు పైగా పాటలు పాడారు. ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించింది. వాణీజయరాం గారి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి.

వాణీజయరాం అసలు పేరు కలైవాణి. నెల్లూరులో 1945 నవంబర్ 30 న వాణీజయరాం జన్మించారు. క్లాసైనా… క్లాసికలైనా… జానపదమైనా.. జాజ్ బీటైనా..ఆమె పాడిన పాట ఏదైనా దానికంటూ ఓ ప్రత్యేకతతో ఆమె పాడుతారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో 25కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బొబ్బిలి, సొమ్ము ఒకడిది సోకు ఒకడిది, తిరుపతి క్షేత్ర మహాత్యం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

వాణీజయరాం గారు నిర్మాతగా కూడా బాగా సక్సెస్ అయ్యారు. ఆమె ఇక లేరు అని తెలిసి ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త సౌత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. సినీ ఇండస్ట్రీలో వాణీజయరాం గారు ఎంతో హుందాగా మెలిగారు. ప్రజా జీవితంలోనూ వాణీజయరాం గారు అందించిన సేవలు మరువలేనివి. మా ‘ గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున వాణీజయరాం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

ఇవి కూడా చదవండి…

వీరమల్లు రావడం కష్టమేనా?

మూగబోయిన వాణీజయరాం గొంతు

ఆ సిరీస్ సంగతేంటి చైతూ?

- Advertisement -