- Advertisement -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి. ఈ రోజు రాష్ట్రంలోని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
- Advertisement -