టీడీపీలోకి వాణి విశ్వనాథ్‌…!

254
Vani Vishwanath to Join TDP..!
- Advertisement -

టీడీపీకి సినీ గ్లామర్ కొత్త కాదు. సినీ రంగంలోనుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించి అనతికాలంలో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ పంథాలోనే ఆయన్ని అనుసరిస్తు టాలీవుడ్‌ నుంచి అనేకమంది సినీ తారాలు టీడీపీలో చేరారు.

తాజాగా టీడీపీకి మరింత సినీ గ్లామర్ తెచ్చేందుకు మాజీ హీరోయిన్ చిరు భామ వాణి విశ్వనాథ్ రంగం సిద్దం చేసుకుంటోంది. వాణి విశ్వనాథ్‌ ఎంట్రీతో రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె టీడీపీని తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారట.

ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు టిడిపి నాయకులు చెన్నయ్‌ వెళ్లి తమ పార్టీలో చేరాల్సిందిగా వాణిని కోరారని సమాచారం. ఇందుకు అంగీకరించిన ఆమె త్వరలో అమరావతి వెళ్లి చంద్రబాబును కలుస్తానని చెప్పిందట.

1980దశకం చివరిలో, 1990దశకంలో తెలుగు సినిమా రంగంలో చెప్పుకోదగిన కథాయికగా రాణించిన వాణీ విశ్వనాథ్‌….మెగాస్టార్‌ చిరంజీవి సహా పేరున్న హీరోల్లో చాలామందితో నటించింది. ప్రస్తుతం 46ఏళ్ల ఈ మాజీ హీరోయిన్‌ క్యారెక్టర్‌ నటిగా అప్పుడప్పుడూ తెరపై కనబడుతోంది. 2006వరకు తెలుగులో 36సినిమాల్లో నటించిన వాణి ఈ ఏడాది (2017) ‘జయ జానకి నాయక’లో నటించింది. మాతృభాష మళయాళం తరువాత అత్యధికంగా నటించింది తెలుగులోనే.

- Advertisement -