4 సీన్లు… 40 లక్షలు

213
Vani Vishwanath Remuneration
- Advertisement -

టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ జయ జానకి నాయక. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. శరత్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్ నటీనటులున్న జయ జానకీ నాయక సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా రీఎంట్రీ ఇచ్చింది. కథానుగుణంగా వాణీ విశ్వనాథ్ రోల్ సినిమాకే హైలెట్ గా ఉంది.

ఈ పాత్రకున్న ఇంపార్టెన్స్ వల్ల కేవలం నాలుగు సీన్లకే భారీ మొత్తం పెట్టిందట చిత్రయూనిట్. ఆమె కనిపించేది నాలుగు సీన్లే అయినా 40 లక్షలను పారితోషికంగా ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే కథానాయికలతో సమానమైన పారితోషికం ఇచ్చుకోవలసి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రకుల్ .. ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, కేథరిన్ స్పెషల్ సాంగ్ చేసిందనే సంగతి తెలిసిందే. వాణి విశ్వనాథ్‌ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు అమ్మ పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటికే రమ్యకృష్ణ, మీనా, రోజా, నదియా వంటి తారలు రీఎంట్రీ బ్రహ్మాండంగా సాగిపోతోంది. ఇక వాణి విశ్వనాథ్ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి.

- Advertisement -