వనజీవి రామయ్య కన్నుమూత..

15
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వనజీవి రామయ్య ఇకలేరు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డి పల్లి గ్రామం. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది.

వనజీవి రామయ్య పేరు దరిపల్లి రామయ్య. చెట్లపై తనకు ఉన్న ఇష్టంతో వనజీవిగా మార్చుకున్నారు. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర, ఇక గ్లోబల్ యూనివర్సల్ పీస్ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా ప్రస్తుతం బోధిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో ఆయన్ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఆయన ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా కూడా ఇచ్చేవారు.ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

Also Read:మూసీ ప్రాజెక్టు పనులు వేగవంతం: రేవంత్

- Advertisement -