ఏపీలో వన మహోత్సవం..

6
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీలో వన మహోత్సవంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మొక్కలు నాటారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారాయణ.

అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను సిఎంకు వివరించారు పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు సీఎం.

రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలన్నారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పీసీబీ శాఖల సమన్వయంతో నివేదిక సిద్ధం చేయగా రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సీఎం సూచనలు చేశారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Also Read:అనుష్క పోస్టర్‌తో 40కి పైగా ప్రమాదాలు

- Advertisement -