జూన్ 2న వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’

226
Vamsi's Fashion Designer release date
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ చిత్రం జూన్ రెండున విడుదల అవుతుంది. ముప్పై ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్.

సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి, ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “వంశీ గారి అభిమానులను, ఈ తరం యువతను అలరించే విధంగా ఉంటుంది. ఇది ఒక మ్యూజికల్ కామెడీ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ” అన్నారు.అప్పటి లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు? అన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో తెరకెక్కించామని చిత్ర దర్శకుడు వంశీ తెలిపారు.

నటీనటులు:సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర… తదితరులు.సినిమా సాంకేతిక వర్గం:సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీవల్లి.

Vamsi's Fashion Designer release date

- Advertisement -