వలిమై @ 500 మిలియన్ల వ్యూస్

96
ajith
- Advertisement -

ZEE5లో లో స్ట్రీమింగ్ అవుతూ విడుదలైన 7 రోజుల్లోనే  500 మిలియన్ల నిమిషాలతో  దూసుకుపోతూ రికార్డ్ సృష్టిస్తోంది అజిత్ కుమార్ “వలీమై’. ZEE5 మార్చి 31న అజిత్ కుమార్ యాక్షన్-ప్యాక్డ్ ‘వలిమై’ యొక్క ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ బ్లాక్‌బస్టర్ ప్రీమియర్‌ను తన వీక్షకులకు అందించింది.విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ డిజిటల్ రంగంలో రికార్డ్ సృష్టిస్తుంది.ఈ సినిమాలో ఉన్న అద్భుతమైన సామాజిక అంశాలతో, థ్రిల్లింగ్ విజువల్స్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్న “వలీమై” నిస్సందేహంగా డిజిటల్ రంగంలో’ పాన్-ఇండియా బ్లాక్ బస్టర్.

అంతేకాదు ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయమని  ప్రజల నుండి ZEE5 సంస్థకు ఊహించ నటువంటి అభ్యర్థనలు అందుతున్నాయి. ప్రజల డిమాండ్‌ను గౌరవిస్తూ, స్ట్రీమింగ్ దిగ్గజం మలయాళ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీక్షకుల కొరికమేరకు మొట్ట మొదటి సారిగా, ‘వలీమై సినిమా’ నుండి తొలగించబడిన సీన్స్ ఇప్పుడు ప్రసారం చేయబడు తున్నాయి

ZEE5 స్ట్రీమింగ్‌ను జరుపుకోవడానికి ముందు అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం  చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది ZEE5 సంస్థ. భారతదేశం లో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. భారతీయ స్ట్రీమింగ్ చరిత్రలో ఇది తిరుగులేని రికార్డు.

హెచ్.వినోత్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, కార్తికేయ కథా, నాయికలుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు
ఎల్లప్పుడూ అద్భుతమైన చలనచిత్రాలను చందాదారులకు మరియు చలనచిత్ర ప్రియులకు ప్రతి నెలా తాజా కంటెంట్  ను అందిస్తూ ‘ZEE5 ఓటిటి’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతూ  అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది .ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది.

- Advertisement -