వాలెంటైన్స్ డే … ఎన్నో ప్రేమలు ప్రారంభమయ్యేది.. మరెన్నో ప్రేమ కథలు ఓ తీరానికి చేరే రోజ ఇది. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎప్పటికీ ఎన్నటికీ బోరు కట్టని తీయని భావం ప్రేమ. ఈ వేలంటైన్స్ డేకి హైలైట్ కపుల్ గా టాలీవుడ్ తారలు అక్కినేని నాగచైతన్య-సమంతల గురించే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్న ఈ జంట.. త్వరలో ఒకటి కాబోతోన్నారు.
ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను ఈ జెస్సీనే ఎందుకు ప్రేమించా డైలాగ్ అందరికి తెలిసిందే. తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’లో వినిపించిన అదే కార్తీక్… అదే జెస్సీని నిజ జీవితంలో సైతంప్రేమించాడు .. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో, పెళ్లికి కొంచెం దూరంలో ఉన్నారు. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దల్ని ఒప్పించి ఒక్కటవ్వడం సినిమాల్లో చూస్తుంటాం. బాలీవుడ్‌లో అయితే వెండి తెర కథల్ని నిజం చేస్తూ, సినీ తారలు ఒక్కటవ్వడం మామూలే. కానీ తెలుగు తెరకు మాత్రం అది అరుదైన అనుభూతి. అప్పట్లో నాగార్జున, అమల… ఇప్పుడు చైతూ, సమంత అరుదైన ఏక్ ఛోటీసీ ప్రేమ్ కహానీ.
ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన వ్యక్తి చైతు అని.. చైతుకి జోడీ నటించడాన్ని ఎంజాయ్ చేస్తానని ఇంటర్వ్యూలలో ఓపెన్‌గా చెప్పేది సమంతా. కానీ ఎవరూ ఆ పాయింట్ ని క్యాచ్ చేయలేకపోయారంతే. ఇక వీళ్ల లవ్ స్టోరీలో విలన్స్ ఎవరూ లేరు కూడా. ప్రేమపై వీళ్లు క్లారిటీ తెచ్చుకుని ఇంట్లో చెప్పగానే.. వాళ్ల సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిసింది. మరి ఈ వేలంటైన్స్ డేకి.. తన ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావని చైతుని అడిగితే ఏమన్నాడో తెలుసా?
ప్రేమంటే ఆనందంగా ఉండడమే. అంతకు మించి నిర్వచనం నాకు తెలీదు. స్కూల్లో, కాలేజీలో కొన్ని ప్రేమకథలు నడిచాయి. కానీ… అవన్నీ కేవలం ఆకర్షణలు మాత్రమే. ప్రేమలో పడడం, విఫలమవ్వడం, మరో కొత్త బంధాన్ని వెదుక్కోవడం ఇవన్నీ మనిషిని, మనసుని ఇంకాస్త దృఢపరుస్తాయి. ప్రేమే ఓ పెద్ద బహుమతి. అందుకే ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంపై నాకు నమ్మకం లేదని నాగచైతన్య చెబుతుండగా నా సినీ ప్రయాణంలోని ప్రతీ మలుపులోనూ చై ఉన్నాడు. స్నేహంతోనే మా ప్రేమ మొదలైంది. అయితే ఓ నిర్ణయం తీసుకోవడానికిఇంత సమయం పట్టింది. నా దృష్టిలో ప్రేమంటేనే చై. ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమ జంట మాదే… అని అందరికీ అనిపిస్తుంటుంది. నేనూ అదే భావనలో ఉన్నానని సమంత చెబుతోంది.ఇంతగా ఒకరినొకరు అర్ధం చేసుకున్నాక.. ఈ వేలంటైన్స్ డేకి హైలైట్ కపుల్ గా వీళ్లిద్దరిని చెప్పుకోవాల్సిందే.