రాజకీయ కురువృద్ధుడు – బీజేపీ అగ్రనేత – మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాజ్ పేయి ఆరోగ్యంపై జాతీయ మీడియాలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కథనాలు వెలువుడుతున్నాయి. గత రెండు రోజులుగా వాజ్ పేయి వెంటిలేటర్ పై ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో వాజ్ పేయి జూన్ లో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రి లో చేరారు. 65 రోజులుగా ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
అనారోగ్య కారణంగా 2009 నుంచి వాజ్ పేయి ఇంటికే పరిమితయ్యారు. ఎయిమ్స్ లో వాజ్ పేయిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని ప్రధాని మోడీ వాజ్ పేయిని పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు వాజ్ పేయిని పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ వర్గాల్లో కలవరం మొదలైంది.