ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరో వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో వరుస సక్సెస్‌లతో మంచి జోష్ మీదున్నారు. ప్రస్తుతం లవ్‌జోనర్‌లో రంగరంగ వైభవంగా అని వస్తుండగా గిరశాయ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు వైష్ణవ్.
తాను చిన్నప్పట్నుంచి ఏమేమో అవ్వాలనుకొని ఇప్పుడు ఇలా నటుడ్ని అయ్యానని తెలిపాడు రోజు జిమ్ కి వెళ్ళేవాడిని, కిక్ బాక్సింగ్ చేసేవాడ్ని. కళ్యాణ్ మామయ్య చెప్తే థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తిరిగి వచ్చిన తర్వాత కిక్‌బాక్సింగ్ ట్రైయినర్ అవుదామనుకున్నా కానీ కుదరలేదన్నారు.
చివరికి ఆర్మీకి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆర్మీ అంతా ఈజీ కాదు, చాలా కష్టపడాలి, నువ్వు చేయలేవు అని మా అమ్మ వద్దంది. తర్వాత కళ్యాణ్ మామ సలహాతో నటుడిని అయ్యానని ఆ సమయంలో బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యానని తెలిపారు.