డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అయ్యాయి. వాటన్నింటినీ మించి లేటెస్ట్‌గా జయ బి. దర్శకత్వంలో రూపొందిన ‘వైశాఖం’ ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేసిన ‘వైశాఖం’ థీమ్ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మంగళవారం విడుదలైన ‘వైశాఖం’ థీమ్ టీజర్‌కి ఒక్కరోజులోనే 1.3 మిలియన్ వ్యూస్ రావడం సినిమాపై ఆడియన్స్‌కి వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని తెలియజేస్తోంది. ఒక చిన్న సినిమాకి ఒక్కరోజులో 1.3 మిలియన్ వ్యూస్ రావడం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సమ్మర్ స్పెషల్‌గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”మా ‘వైశాఖం’ చిత్రం థీమ్ టీజర్‌కి ఒక్కరోజులోనే 1.3 మిలియన్ వ్యూస్ రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. యూ ట్యూబ్‌లో మా చిత్రం థీమ్ టీజర్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ టీజర్‌ని రిలీజ్ చేసిన సూపర్ డైరెక్టర్ కొరటాల శివకి మా స్పెషల్ థాంక్స్. యూత్‌కి, మాస్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అందరికీ నచ్చే యూనివర్సల్ సబ్జెక్ట్‌తో రూపొందిన ‘వైశాఖం’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. సమ్మర్ స్పెషల్‌గా త్వరలోనే ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.