విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం చేశాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లో శతకం బాదడంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో అతని ప్రవర్తనపై విమర్శలు వచ్చినప్పటికీ, అవేవీ అతని ఫామ్‌పై ప్రభావం చూపలేదని ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు.
కోహ్లీ 15 ఏళ్ల తర్వాత, రోహిత్ 7 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఆడుతుండటం ప్రధాన ఆకర్షణగా భావించబడింది. అయితే మ్యాచ్ మొదలైన గంటలోపే వైభవ్ తన దూకుడు బ్యాటింగ్‌తో అన్ని చర్చలను పక్కకు నెట్టి, తన ప్రతిభను చాటాడు. భారత ఆటగాళ్లలో ఇది రెండో వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ. మొదటి స్థానంలో 2024లో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 35 బంతుల్లో శతకం చేసిన అన్మోల్‌ప్రీత్ సింగ్ ఉన్నాడు.
భారత ఆటగాళ్ల వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీలు:
35 బంతులు – అన్మోల్‌ప్రీత్ సింగ్, పంజాబ్ vs అరుణాచల్ ప్రదేశ్, 2024
36 బంతులు – వైభవ్ సూర్యవంశీ, బీహార్ vs అరుణాచల్ ప్రదేశ్, నేడు
40 బంతులు – యూసుఫ్ పఠాన్, బరోడా vs మహారాష్ట్ర, 2010
41 బంతులు – ఉర్విల్ పటేల్, గుజరాత్ vs అరుణాచల్ ప్రదేశ్, 2023
42 బంతులు – అభిషేక్ శర్మ, పంజాబ్ vs మధ్యప్రదేశ్, 2021
Also Read:ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

