ప్రపంచదేశాలను ఇప్పుడు మంకీపాక్స్ కలవరపెడుతోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు వేలసంఖ్యలో నమోదవుతుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కరోనా తరహాలోనే మంకీపాక్స్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు ఆహ్వానాన్ని పంపింది.
ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది. వారానికి కనీసం లక్ష డోసుల వ్యాక్సిన్లైనా తయారు చేయగలిగే సామర్ధ్యం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు కలిగిఉండాలని ఇందుకోసం రాయితీ ఇస్తామని తెలిపింది.
మంకీపాక్స్… ఇది జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది చాలావరకు ప్రాణాంతకం కాకపోయినా, తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటాయి. దాదాపు 76 దేశాల్లో మంకీపాక్స్ విస్తరించగా ఇప్పటివరకు5 గురు చనిపోయారు.