వారి పెళ్లి పై మోహన్ బాబు స్పందన

31
- Advertisement -

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి రెండో కుమారై భూమా మౌనిక‌రెడ్డిని రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టమేనా ?. మ‌నోజ్ పెళ్లి మొత్తం ఆయన సోద‌రి మంచు లక్ష్మినే దగ్గర ఉండి చూసుకుంది. లక్ష్మి ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం కూడా జరిగింది. పైగా ఈ పెళ్ళికి మోహన్ బాబు, అలాగే మంచు విష్ణు కేవలం అతిధులుగా మాత్రమే వచ్చారు. ఈ నేపథ్యంలోనే మనోజ్ పెళ్లి మోహన్ బాబుకు అసలు ఇష్టం లేకుండా జరిగింది అని పుకార్లు పుట్టించారు.

ఇంతకీ ఈ పుకార్లలో నిజం ఉందా ?. నిజంగానే మోహన్ బాబుకి ఇష్టం లేకుండానే మనోజ్ పెళ్లి చేసుకున్నాడా ?, ఈ విషయాలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. మరి మోహన్ బాబు, మనోజ్ పెళ్లి పై ఎలా రియాక్ట్ అయ్యారో ? ఆయన మాటల్లోనే విందాం రండి. “మనోజ్ బాబు నా దగ్గరికి వచ్చి, ఫలానా భూమా నాగిరెడ్డిగారి రెండో కుమారై.. చాలా రోజుల నుంచి పరిచయం, మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని అన్నారు.

మనోజ్ మాటలకు నేనేం అంటాను. నువ్వు ఓసారి ఆలోచించుకోరా ? అని చెప్పిన మాట వాస్తవం. అందులో దాపరికాలు ఏమీ లేవు. ఐతే, మనోజ్ బాబు మాత్రం ‘లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని దైర్యంగా చెప్పాడు. అంతే.. సరే అలాగే కానీ అన్నాను. ఏ మాత్రం ఆలోచించకుండా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాను. అయినా వాడికి ఇష్టమైన పెళ్లిని నేను ఎందుకు కాదు అంటాను ?. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు’ అంటూ మోహన్ బాబు ఓపెన్ అయ్యారు.

ఇవి కూడా చదవండి…

రంగబలిగా వస్తున్న నాగశౌర్య.!

ఆమెకి 14 కోట్ల బంగారం వాడారా ?

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ సాంగ్

- Advertisement -