టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఓ ఇద్దరు డైరెక్టర్లతో తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాధ్. ఈ ఇద్దరు డైరెక్టర్లతో వినాయక్ కు మంచి అనుబంధం ఉంది. ముగ్గురు కలిసి చాలా సరదాగా ఉంటారట. రాజమౌళిని కలవడం ఫ్యామిలీ గ్యాదెరింగ్‌లా ఉంటుందట.
రాజమౌళికి, ఆయన అన్న కీరవాణి కి వినాయక్ అంటే చాలా ఇష్టమట. ఎప్పుడైనా వినాయక్ వాళ్లింటికి వెళ్తే.. చాలా ఆనందంగా ఫీలవుతుందట రాజమౌళి ఫ్యామిలీ. రాజమౌళి స్వభావం కొంచెం కూల్ గా ఉంటుందట. ఇక పూరి మాత్రం అలా కాదంటున్నాడు వినాయక్. ఆయనలో అసలు భయం కానీ, కేర్ కానీ, ఏదీ ఉండదట. ఎప్పుడూ బిందాస్‌గా ఉంటాడు. అందుకే లోలో ఉన్నప్పుడు జగన్‌ను తలచుకోవాలనిపిస్తుందట వినాయక్ కి. ఆయనలోని ఈ ప్రత్యేకత కారణంగానే మళ్లీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలని వినాయక్ కోరుకుంటున్నాడు.