ఏపీ ప్రభుత్వం జలదోపిడి:ప్రకాష్

9
- Advertisement -

ఏపీ ప్రభుత్వం జల దోపిడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..తక్షణమే ఏపీ జల దోపిడిని అడ్డుకోవాలి అన్నారు సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్. ముఖ్యమంత్రి దగ్గర ఉండి జల దోపిడి చేపిస్తున్నాడు…గురువు చంద్రబాబు చెప్పినట్లు శిష్యుడు రేవంత్ రెడ్డి ఆటలు ఆడతాడు.తెలివిగా కృష్ణా నది తో అనుసంధానం కాకుండా గోదావరి జల దోపిడీకి పాల్పడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతి ఇచ్చింది.వెంటనే నల్లమల సాగర్ అనుమతులు రద్దు చేయాలి అన్నారు.

లేకపోతే మరో జలసాధన ఉద్యమం తప్పదు.అధిత్యనాధ్ దాస్ అనాడు తెలంగాణ వ్యతిరేకంగా వందల సంతకాలు పెట్టాడు..ఇప్పుడు మళ్ళీ తెలంగాణ కు అన్యాయం చేసేందుకు ఆయనను చంద్రబాబు ఇక్కడ పెట్టించాడు.తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి సాగునీటిపై ఎలాంటి అవగాహన లేదు ..తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోంది అన్నారు.

మేడిగడ్డను కూడా బాంబులు పెట్టీ పేల్చారని గతంలోనే చెప్పాను.చెక్ డ్యాం లను కూడా బాంబులు పెట్టీ పేల్చారని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పోలీస్ పిర్యాదు చేశారు ఇప్పటివరకు చర్యలు లేవు ..అలానే మేడిగడ్డను కూడా పేల్చారని నీటిపారుదల ఇంజనీర్లు పిర్యాదు చేశారు దానిపై కూడా ఎలాంటి చర్యలు లేవు.ఏపీ కి గోదావరి నీళ్ళు వదలడం కోసమే మేడిగడ్డ ను పేల్చారు.గతంలోనే నేను అనేకసార్లు చెప్పాను.ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ కు నీటి కేటాయింపులో అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీనే అన్నారు .

ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అన్యాయం చేస్తోంది.2.0జల సాధన ఉద్యమం అవసరం.అది కేసీఆర్ తోనే సాధ్యం.రానున్న రోజుల్లో మన నీటి కేటాయింపుల కోసం కేసీఆర్ అధ్యక్షతన మరో ఉద్యమం ఉంటుంది అన్నారు.

Also Read:ఇమ్రాన్ ఖాన్‌ సోదరి అరెస్ట్!

 

- Advertisement -