- Advertisement -
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు. విజయవాడలో ఏపీ సీఎంను కలిశారు వీహెచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత సీఎం దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడు అని.. ఆయన పేరిట ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎంను వీహెచ్ కోరారు.
దీంతో పాటు ఏపీలోని ఒక జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని సీఎం చంద్రబాబుకు వీహెచ్ విజ్ఞప్తి చేశారు. తన ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వీ హనుమంతరావు తెలిపారు.
Also Read:రేపటితో మహా కుంభమేళా ముగింపు
- Advertisement -

