అటవీశాఖ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన

10
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో జరిగిన 28వ అఖిల భారత అటవీశాఖ క్రీడోత్సవాలలో తెలంగాణ అటవీశాఖ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 3 బంగారు, 3 వెండి, 5 కాంస్యం మొత్తంగా 11 పతకాలు సాధించారు.. దేశవ్యాప్తంగా పాల్గొన్న రాష్ట్రాల మధ్య తెలంగాణ అటవీశాఖ తమ పోటీదారులతో సమానంగా నిలబడటం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రతిభ కనబర్చింది..

అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారిణి డాక్టర్ సి. సువర్ణ ఈ విజయం పట్ల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడా రంగంలో ఇలాంటి విశిష్ట ఫలితాలు శాఖలోని అధికారి–సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచుతాయని, ఆరోగ్యపరంగా, మానసికంగా క్రీడలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

డిస్కస్ త్రో మరియు జావెలిన్ త్రో విభాగాల్లో FBO M.సునీత 2 బంగారు పతకాలను కైవసం చేసుకుంది. అలాగే క్యారమ్స్ విభాగంలో అకౌంట్స్ సూపరిండెంట్ పద్మావతి 1 బంగారు పతకం 2 వెండి పతకాలను గెలుచుకుంది…ఈ విజయాలు కేవలం వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాకుండా, శాఖలోని క్రీడా సాంస్కృతిక వాతావరణానికి, ఉన్నతాధికారుల ప్రోత్సాహానికి ప్రతిఫలమని డాక్టర్ సువర్ణ అన్నారు. భవిష్యత్తులో మరింత శిక్షణ, సదుపాయాలు, ప్రోత్సాహం అందించి తెలంగాణ అటవీశాఖను జాతీయ స్థాయిలో అత్యుత్తమ బృందంగా మార్చడం లక్ష్యమని పేర్కొన్నారు.క్రీడాకారులు రాబోయే క్రీడోత్సవాల్లో మరిన్ని పతకాలు సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలవాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:‘ఆంధ్ర కింగ్ తాలూకా’..థియేటర్స్‌లో కలుద్దాం!

- Advertisement -