ఉత్తరాఖండ్‌లో ఘటనలో 203 మంది గల్లంతు.. 11 మంది మృతి..

179
Uttarakhand Flood
- Advertisement -

ఆదివారం ధౌలిగంగా నదికి ఆకస్మికంగా వరద పోటెత్తడంతో ఉత్తరాఖండ్‌లో ఘోర విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. హిమాలయ పర్వతాల్లోని నుంచి మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నదిలోని నీటిమట్టం పెరిగిపోయి లోతట్టు ప్రాంతాలను వరద తుడిచిపెట్టేసింది. దీనిపై ఈరోజు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వివరాలు తెలిపారు. ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని సీఎం వెల్లడించారు. వారిలో 11 మంది మృతదేహాలను వెలికితీశామని వివరించారు.

రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. రేణీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే తపోవన్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, అక్కడే అనుబంధంగా మరో సంస్థ కూడా ఉందని సీఎం రావత్ వివరించారు. ఆ సంస్థలో పాతికమంది వరకు పనిచేస్తున్నట్టు సమాచారం ఉందని, అయితే, వారందరి ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

- Advertisement -