ఒకే ఫ్యాన్, ఒకే లైట్…బిల్లు మాత్రం 128కోట్లు

294
Up electricity bill
- Advertisement -

విద్యుత్ శాఖలో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుండటం సహజమే . మరీ కరెంట్ బిల్లు విషయంలో ఎక్కువగా తప్పులు జరుగుతుంటాయి. ఒకరి బిల్లు ఇంకోకరికి రావడం…తక్కవ మంది ఉన్నా ఎక్కువ  బిల్లు రావడం మనం ఇదివరకు చూసుంటాం. కానీ ఏకంగా ఒక వృద్ద జంట ఉన్న ఇళ్లుకు మాత్రం 128కోట్లు కరెంట్ బిల్ వచ్చింది. దీంతో ఆ వృద్ద జంట ఒక్కసారిగా బయపడిపోయారు. దీంతో విద్యుత్ శాఖ ఉద్యోగులను ఆశ్రయించారు ఆ జంట. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.

హపుర్ నగరంలోని ఛార్మి గ్రామంలో షమీమ్ అనే వృద్ద జంట ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. వాళ్ల ఇంట్లో కేవలం ఒక లైట్, ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది. కానీ వారికి నెల కరెంట్ బిల్ మాత్రం 128కోట్ల రూపాయలు వచ్చింది. బిల్ కట్టనందుకు వారి ఇంట్లో కరెంట్ ను కూడా కట్ చేశారు విద్యుత్ అధికారులు.

బిల్ కడితేనే కరెంట్ ఇస్తామని చెప్పారు. చేసేదేమి లేక కొన్ని రోజులు వాళ్లు చీకట్లోనే గడిపారు. దీంతో విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోరాపాటు జరిగిందని ఒప్పుకుని సరిచేస్తామని ఆ దంపతులకు మాటిచ్చారట..త్వరలోనే ఆ పొరపాటును సరిచేస్తామని చెప్పారు. మొత్తానికి ఈ కరంట్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -