కాంగ్రెస్‌లో కలకలం..ఉత్తమ్ సీఎం అవుతారన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

8
- Advertisement -

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నా నాలుక‌పై పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయి.. త‌ప్ప‌నిస‌రిగా మంత్రి ఉత్త‌మ్ సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలో నీటి పారుద‌ల పనుల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించగా కోమటిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు. న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌నిస‌రిగా సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు.

నేను ఏది చెప్పినా త‌ప్ప‌కుండా అయి తీరుతుంద‌న్నారు. బునాదిగాని పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలని కోరారు. కాలువల వెడల్పు పెంచాలి.. దీని ద్వారా ఆయకట్టు డ‌బుల్ అవుతుంద‌న్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూర‌దృష్టితో ప్రతిపాదనలు పంపాల‌ని ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆదేశించారు.

Also Read:అంధులు, వికలాంగులపై ప్రతాపమా?:శ్రీనివాస్ గౌడ్

- Advertisement -