Uttam:కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదు

23
- Advertisement -

కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలదోపిడిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఉత్తమ్…రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

కృష్ణా నదీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారన్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నది జలాలను కేంద్రానికి అప్పగించలేదని తీర్మానం చేయడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వ విజయమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ఛలో నల్గొండ సభకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

- Advertisement -