ఉత్సవం..టీజర్ డేట్ ఫిక్స్

14
- Advertisement -

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్.

హీరో పాత్ర పోషించిన దిలీప్ ప్రకాష్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపించారు. తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు వున్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కళ పట్ల అతని అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ ఆహ్లాదకరంగా ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ని కలిగించింది. ది షో మస్ట్ గో ఆన్ అనే క్యాప్షన్ ప్లాట్‌లైన్ గురించి తెలియజేస్తుంది. ఉత్సవం మేకర్స్ టీజర్‌ డేట్ ని అనౌన్స్ చేశారు. ది రిహార్సల్ ఆఫ్ ‘ఉత్సవం’ జనవరి 28న ఉదయం 11:34కి లాంచ్ కానుంది.

‘ఉత్సవం’ లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

Also Read:టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ ఆల‌యం

- Advertisement -