ఉస్తాద్ కోసం మరో ఇద్దరు రచయితలు

36
- Advertisement -

హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఐతే, మంచి దర్శకుడిగా కంటే కూడా అంతకు మించి మంచి మాటల రచయితగా హరీష్ శంకర్ కి గొప్ప పేరు వుంది. పంచ్ కి హరీష్ శంకర్ పర్యాయపదం. అలాగే హరీష్ శంకర్ రాసే లోతైన మాస్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా హరీష్ శంకర్ అద్భుతమైన మాస్ పంచ్ లు రాశాడని టాక్. అందుకే, హరీష్ శంకర్ స్క్రిప్ట్ కు పవన్ వెంటనే ఓకే చెప్పాడట.

ఐతే, పవన్ స్క్రిప్ట్ కోసం హరీష్ శంకర్ మరో ఇద్దరు ఇద్దరు రచయితలను డిస్కషన్స్ పేరుతో స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేశాడు. ఇంతకీ ఆ రచయితలు ఎవరో తెలుసా ?, బీవీఎస్ రవి, అలాగే కామెడీ ట్రాక్ కోసం కోన వెంకట్ ను కూడా హరీష్ స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేశాడని టాక్. తన సినిమాల్లో బలమైన విలువైన కామెడీ ఉండాలనేది హరీష్ శంకర్ ఆలోచన. అలాగే పవన్ కళ్యాణ్ తాలూకు మాస్ ఇమేజ్ ను హైలైట్ చేయడం కోసం కూడా హరీష్ శంకర్ అండ్ టీమ్ బాగా కసరత్తులు చేసిందట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఖ‌రారు అయింది అని పుకార్లు వైరల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే, దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి, పవ‌న్ క‌ళ్యాణ్ కోసం కథ రాసిన సమయంలో దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ మొదట అనుకున్న కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఒక్క హీరోయిన్ కే స్కోప్ ఉంది. మరి ఆ హీరోయిన్ శ్రీలీల అవుతుందో లేక, శ్రుతి హాసన్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

విశ్వక్‌ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ: నివేదా

వాయిదా పడనున్న ప్రభాస్ సినిమా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా !

- Advertisement -