పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోండగా ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.
ఇటీవలె సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి సెట్స్ లో ఉన్న పవన్ లుక్ అయితే అదిరింది. మెరూన్ షర్ట్ వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని పవన్ మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
Also Read:శ్రావణ మంగళ గౌరీ వ్రత విధానం ….

