పవన్ -హరీశ్ శంకర్ సరదా వీడియో

5
- Advertisement -

టాలీవుడ్‌లో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) – డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) జోడీ హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉస్తాద్ భగత్‌ సింగ్ ‘Ustaad Bhagat Singh’ చిత్రంలోని #AuraOfUstaad పాటను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్‌ను అభినందించిన క్షణాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పాటలోని ఎనర్జీ, మాస్ ఎలివేషన్స్‌పై పవన్ సంతోషం వ్యక్తం చేస్తూ, హరీశ్ శంకర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పాట విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించినట్లు తెలుస్తోంది. హరీశ్ శంకర్ కూడా పవన్‌తో కలిసి నవ్వులు పంచుకుంటూ సరదాగా మాట్లాడిన దృశ్యాలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.

ఈ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ సాధించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుందని నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!

 

- Advertisement -