పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న థియేటర్లలో విడుదల కానుండగా ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉండటంతో, మార్చి రిలీజ్ స్లాట్‌ను పవన్ కళ్యాణ్ సినిమా దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ కలవడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన పెప్పీ డ్యాన్స్ నంబర్ “దేఖ్లేంగే సాలా”కు మంచి స్పందన లభించగా, మేకర్స్ త్వరలోనే రెండో సింగిల్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనుకోని పరిణామంగా, అధికారిక విడుదలకు ముందే ఆ పాట ఆన్‌లైన్‌లో లీక్ కావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. వాస్తవానికి ఈ పాటను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఆశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్

