ఉస్తాద్ భగత్‌సింగ్..ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

4
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. మార్చి 19, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్ దర్శకత్వం వహించారు.

సినిమా విడుదలకు ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదికను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ కార్యక్రమం మార్చి 15, 2026న హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గౌండ్ర్స్‌లో జరగనుందని మేకర్స్ వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌తో పాటు చిత్రంలోని నటీనటులు, సాంకేతిక బృందం సభ్యులు హాజరుకానున్నారు. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా దేవీ శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి.

Also Read:‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్

- Advertisement -