నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. సాధారణంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి బ్యాంకును ఆశ్రయించి అకౌంట్ ఓపెన్ చేస్తుంటాము. అలాగే నేటి డిజిటల్ యుగంలో ప్రతి చోట కూడా క్యాష్ లెస్ పేమెంట్ సిస్టం ఉండడం వల్ల గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ వాడాలన్నా బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. ఇకపోతే బ్యాంకు అకౌంట్ లో చాలానే రకాలు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్.. ఇలా చాలానే రకాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులు ఎక్కువ శాతం శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ అకౌంట్ ను సంబంధిత కంపెనీ ఏదో ఒక బ్యాంకుతో ఒప్పందం చేసుకొని ఎంప్లాయ్ కోసం శాలరీ అకౌంట్ ను ఓపెన్ చేయిస్తుంది.
ఇందులో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ మెంటైన్ చేయకపోయిన ఖాతా రన్ అవుతుంది. అయితే ఆ కంపెనీలో జాబ్ మానేసిన తరువాత కూడా శాలరి అకౌంట్ అలాగే ఉంటుంది. దీనిని కొందరు క్లోజ్ చేసుకోకుండా అలాగే ఉంటారు. తద్వారా ఆ శాలరీ అకౌంట్ కాస్త సేవింగ్స్ అకౌంట్ లోకి కన్వర్ట్ అవుతుంది. తద్వారా బ్యాంక్ లో మినిమమ్ బ్యాలెన్స్ మెంటైన్ చేయకపోతే ప్రతి నెల పెనాల్టీ పడుతుంది. అలాగే సంవత్సరాది ఛార్జీలు కూడా సదరు బ్యాంకు కట్ చేసుకుంటుంది. అందువల్ల బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు. పెనాల్టీ ఛార్జీలు, ఇతర చార్జీలను కలిపి మరింత చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కంపెనీ తరుపున శాలరీ అకౌంట్ కింద బ్యాంకు ఖాతా ఉండి దానిని ఉపయోగించని పక్షంలో వెంటనే క్లోజ్ చేయించుకోవడం మంచిది. లేదంటే సదరు బ్యాంకు విదించే పెనాల్టీల కారణంగా మన జేబులకు చిల్లులు పడటం ఖాయం.
Also Read:Rohith Sharma: చివరి టెస్టుకు రోహిత్ దూరం?