‘శలభాసనం’ వేస్తే ఇన్ని ఉపయోగాలా!

135
- Advertisement -

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఎన్ని ప్రయోజనలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న అలవాట్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి. అందువల్ల ప్రతిరోజూ ఒక అరగంట యోగా కు సమయం కేటాయించడం వల్ల అన్నీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని తరచూ యోగా నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి.. ప్రతి ఆసనం వల్ల ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. ఇదిలా ఉంచితే అధిక బరువుతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలమంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోవడం వల్ల పాతికేళ్ళ వయసులో కూడా 40 ఏళ్ల వారిలా కనిపిస్తారు. అయితే పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడానికి యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికి.. వాటిలో శలభాసనం కూడా ఒకటి.. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది. ఆంతేకాకుండా నడుం నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి. వెన్నుపూస బలపడుతుంది. స్లీప్ డిస్క్ సమస్యలు, సియాటికా నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

శలభాసనం వేయు విధానం
ముందుగా చదునైన నేలమీద బోర్ల పడుకోవాలి. మొఖం నెల మీద వాల్చి చేతులు వెనుకకు చాపాలి. ఊపిరి వదిలి తల మరియు ఛాతీ, కాళ్ళు వీలైనంత పైకి ఎత్తి పక్కటెముకలు గానీ, మోచేతులు గానీ నేలమీద ఆనకుండా కేవలం పొట్ట మాత్రమే శరీర బరువంతా మోస్తూ ఉండాలి. పిరుదు కండరాలను సంకోచింపజేసి, తొడ కండరాలను సాగతీయాలి. రెండు కాళ్ళను పూర్తిగా చాపి ఉంచాలి. తొడల దగ్గర మోకాళ్ళు, చీలమండలు తాకుతూ ఉండాలి. శరీరం బరువు చేతుల మీద మోపకుండా వీలైనంత వరకు ఈ స్థితిలో ఒకటి లేదా రెండు నిముషాలు ఉండాలి. అయితే ఈ ఆసనం మొదట్లో కాస్త కష్టమనిపించిన.. కొన్నాళ్ళ సాధన తరువాత సులుభమే అవుతుంది.

అయితే గర్బిణి స్త్రీలు, పొత్తి కడుపులో సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:చేతుల్లో వణుకు..ఈ జబ్బు ఉన్నట్లే!

- Advertisement -